సామాన్యుడికి అందుబాటులో ఇసుక..
1 min readపేదలకు నెరవేరునున్న సొంత ఇంటి కల
పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల : ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత నేడు ఇసుక పాలసీ పై ఒక జీవో విడుదల చేయడం అభినందనీయమని . మంగళవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత ఇసుక అందిస్తున్నారని తెలిపారు. ఉచిత ఇసుక వల్ల పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని, ఆలాగే భవన నిర్మాణలు ఊపందుకోనున్నాయని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఇసుక మాఫియా నడిపించి ఒక్క ఇసుకలోనే 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. గృహనిర్మాణశాఖ సరఫరా పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో ప్రభుత్వం మింగేసిందని ఆరోపించారు. ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతే ద్యేయంగా కొత్త పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు.