ఇసుక ధర టన్నుకు రూ.88 లు తగ్గింపు
1 min readఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కు సీనరేజీ ఫీజు, డీఎంఎఫ్, మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు 88 రూపాయలు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..నదీ పరీవాహక గ్రామాల ప్రజలు పంచాయతీ సెక్రెటరీ ల అనుమతితో స్వంతపనులు, గ్రామ అవసరాలు,కమ్యూనిటీ పనుల కోసం యంత్రాలు లేకుండా ఎద్దుల బండ్లు లేదా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకోవచ్చునని తెలిపారు..ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ కూడా అందుబాటులోకి రానుందని కలెక్టర్ తెలిపారు.. రీచ్ లు, డిసిల్టేషన్ పాయింట్ల వద్దకు అనుమతించిన ఇసుకను రవాణా చేసే వాహనాలకు ఉచిత ఇసుక రవాణా వాహనం అనే బ్యానర్ ఉండడంతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ లేదా డ్రైవర్ల మొబైల్ లలో జిపిఎస్ ఎనేబుల్ నోటిఫికేషన్ ఉండాలన్నారు… బోర్లు,బ్రిడ్జి ల వద్ద ఇసుక తవ్వకాలు జరుగకుండా వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ లు పర్యవేక్షణ చేయాలన్నారు…ఇసుక రీచుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ను పటిష్ఠంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత ఉన్న ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, గనుల శాఖ డిడి రవిచంద్, ఆర్డబ్లూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, డిపిఓ భాస్కర్, డిటిసి శాంతకుమారి, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.