సూపర్ సీక్స్ ప్రచారంతో బడేటి చంటి, ప్రజా సంకల్పయాత్ర..
1 min readఆరోగ్యమంతమైన సమాజ స్థాపనే కూటమి ధ్యేయం
ఎ.ఎస్.ఆర్ స్టేడియం క్రీడాకారులతో మాటామంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం వైసిపి నెలకొల్పుతోన్న విష రాజకీయ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన చేయడం టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ప్రజల్లో భరోసా నింపారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలెప్పుడో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారని పేర్కొన్నారు. ఏలూరులో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ నాయకులతో కలిసి ఆయన తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు. రాజకీయాలలో ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకువచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం.ఆ దిశగా పార్టీ ఆశయాలను, పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి.. నియోజకవర్గంలోని ప్రజలను వారి నివాసిత ప్రాంతాలకు వెళ్ళి కలవడంతో పాటూ వారిలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో సంకల్పయాత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతన్నారాయన.. నివాసిత ప్రాంతాలను చాలా వరకు చుట్టేసిన బడేటి ఎక్కడెక్కడ ప్రజలు ఉంటారో వారి చెంతకు కూటమి అవలంభించనున్న విధానాలను తీసుకువెళ్తున్నారు. తాజాగా ఏలూరులోని ఎఎస్‌ఆర్ గ్రౌండ్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లలో వాకర్స్‌ను, ఎఎస్‌ఆర్ గ్రౌండ్ వెనుక వున్న స్వీమ్మింగ్‌ఫూల్ వద్ద ఉన్న వారిని బడేటి చంటి నేరుగా కలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఫాక్షనిజం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు ప్రజా చైతన్యం ఎంతో అవసరమన్నారు. ఆ దిశగా విస్త్రృతంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజలు చీదరించుకొని, చీకొడుతున్న ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమేనని, ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రానికి పట్టిన అధికార చీడకు వైద్యం చాలా అవసరమని, అది అనుభవిజ్ఞులైన పాలనాదక్షత కలిగిన ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఇదే విషయాన్ని తమ ఓటు ద్వారా ధృవీకరిస్తాయరని బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.