వట్లూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం లో సంక్రాంతి సంబరాలు
1 min readమన సంస్కృతి, సాంప్రదాయాలను మరువకూడదు
ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి
తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం
పిండి వంటలు,రంగవల్లులు, పతంగులు,గంగిరెద్దు హరిదాసు తో సందడే సందడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: వట్లూరు.డా:బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి,మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఉద్దేశంతో కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలను మన తెలుగింటి సాంప్రదాయాలకు ఉట్టిపడేలా సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి అన్నారు. విద్యార్థులు బోగిమంటలతో, రంగురంగుల రంగవల్లులు అలంకరించి పోటీతత్వంతో ముగ్గులువేసి, గాలిపటలు ఎగరవేస్తూ కొలహాలంగా పండుగను నిర్వహించారు. ఆంధ్ర అరిసెలు,పిండి వంటలు, విద్యార్థులు ఒకరికి ఒకరు అందజేసుకుని సందడి చేశారు. అదేవిధంగా గంగిరెద్దు ఆటలు, హరిదాసుని వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నరు.ఈ సందర్బంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ మనం ఎక్కడున్నా సంస్కృతి, సంప్రదాయలు మరువకొండ వాటి విలువలను తెలుసుకోవాలని వాటిని ఆచరించాలని అవి భావితరాలకు శాశ్వతంగా నిలిచిపోతాయని విద్యార్థులకు సూచించారు.