ఆల్ డిక్షన్ లో సంక్రాంతి సంబరాలు
1 min readకార్మికులకు ఆటల పోటీలు
సందడి సందడిగా డిక్షన్ కార్మికులు – హెచ్ఆర్ మేనేజర్ నరేష్..
పల్లెవెలుగు వెబ్ కడప: సంక్రాంతి పండుగ సందర్భంగా సందడి సందడిగా మారిన ఆల్ డిక్షన్, ఆకట్టుకున్న సంప్రదాయ దుస్తుల పోటీలు, కనువిందు చేసిన రంగవల్లులు, కడప నగరంలోని ఇండస్ట్రియల్ పార్కు ఆల్ డిక్షన్ లో కార్మికులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని ఆల్ డిక్షన్ కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ నరేష్ అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల పోటీలలో 1000 మంది పైగా పాల్గొన్న కార్మికులు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు, విజేతలకు ఒకటవ బహుమతి, రెండో బహుమతి, మూడవ బహుమతులను ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఆరోజు ఇవ్వడం జరుగుతుందన్నారు, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు, ఆటలు శారీరక వ్యాయామానికి సమానంగా పనిచేస్తాయని తెలిపారు, ఆటలతో మనశాంతి దొరుకుందన్నారు, ఈ కార్యక్రమంలో రాధా కృష్ణ, వాకిద్, అరుణ్ గోసిక్, వికాస్ మణికంఠ రెడ్డి, ఆల్ డిక్షన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.