మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పర్వదినం
1 min readముగ్గులు వేయడం ప్రపంచంలోని అన్ని దేశాలలో మన దేశానికే ప్రత్యేకం.
కర్నూల్ నగరంలోని బంగారు పేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల బహుమతుల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పర్వదినం అని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరం లోని బంగారు పేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని బహుమతులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు గిడ్డమ్మ ,శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారుపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడంతోపాటు అందులో ముగ్గులు వేయడంలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. సంక్రాంతి పర్వదినం మన సంస్కృతిని, నాగరికతను తెలియజేస్తుందని ఆయన వివరించారు. ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళాత్మక హృదయం ను ముగ్గులు వేయడం ద్వారా ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. ఈ ముగ్గుల పోటీల్లో భాగంగా మహిళలు వేసిన రంగు రంగుల ముగ్గులు వారి అభిరుచులకు అద్దం పట్టాయని చెప్పారు. మహిళలు వేసిన ముగ్గులు అందర్నీ ఆకట్టుకున్నాయని వివరించారు. ముగ్గులు మన దేశ నాగరికతకు చిహ్నమని, ఇలాంటి ముగ్గులు వేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేదని ఇది మన దేశానికి ప్రత్యేకత అని చెప్పారు .ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు సాధికారత, స్వా వలంబన ముఖ్యమైనదని వివరించారు .సంక్రాంతి పండుగను దేశంలోని అన్ని ప్రాంతాలలో కులాలు, మతాలకు అతీతంగా జరుపుకుంటారని ఆయన తెలియజేశారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాలలో నూతన వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూల్ నగర ప్రజలందరికీ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.