PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంత కష్టాలు.. మండల వాసులకు తప్పని తిప్పలు

1 min read

ఎమ్మెల్యే సారు మా సమస్యను పరిష్కరించరు

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పంచాయతీకి ఆదాయం ఉన్న గడివేముల గ్రామంలో అభివృద్ధి సున్నా మండలానికి ముఖ్యమైన సంత మార్కెట్ కష్టాలు మండల వాసులకు ఏటా తప్పడం లేదు ప్రతి వారం గురువారం నాడు జరిగే సంతకు శాశ్వత స్థలం లేక పాత బస్టాండ్ లోని మసీదు కూడలి నుండి పాత పంచాయతీ కార్యాలయం వరకు రోడ్డుపైన సంత నిర్వహిస్తున్నారు సంత మార్కెట్లో వ్యాపారస్తులకు గేటు వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు. ప్రజల అవసరం మేరకు శాశ్వత సంత మార్కెట్ ఏర్పాటు చేయకపోవడం వర్షాకాలంలో మోకాలు లోతు నీటిలో సంత చేసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని అలాగే వేసవిలో ఎండవేడికి తీవ్రంగా అల్లాడి పోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యేచరితా రెడ్డి ఈ సమస్యపై స్పందించి పరిష్కరించాలని సంత మార్కెట్ కు శాశ్వత స్థలం కేటాయించాలని మండల వాసులు కోరుతున్నారు .

About Author