దామగట్లలో సీసీ రోడ్లకు సర్పంచ్ భూమి పూజ..
1 min readగ్రామ అభివృద్ధికి కృషి: సర్పంచ్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో పల్లె పండుగ..పంచాయితీ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9:30 కు గ్రామ సర్పంచ్ మాధవరం సుశీలమ్మ పనులకు భూమి పూజ చేశారు.30 లక్షల ఉపాధి హామీ పథకం కేంద్ర నిధులతో గ్రామంలోని మద్దూర్ నగర్ -2,మరియు బైరెడ్డి నగర్ లో సీసీ రోడ్లకు ఆరు అభివృద్ధి పనులకు గాను సర్పంచ్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఎంపీటీసీ తిప్పారెడ్డి,గ్రామ టిడీపీ నాయకులు మాధవరం పాల్ రత్నం పూజల అనంతరం టెంకాయలు కొట్టి భూమి పూజ చేశారు.గత ఆగస్టు నెలలో 23వ తేదీన గ్రామంలో జరిగిన గ్రామ సభలో గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకు గాను అప్పట్లో తిరుమనం చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న సిమెంట్ రోడ్లను త్వరగా ప్రారంభించి వాటి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అంతే కాకుండా గ్రామంలో అవసరమైన డ్రైనేజీ కాలువలు రహదారులు తదితర పనులు ఏమైనా ఉంటే వాటిని రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ సుశీలమ్మ మరియు పాల్ రత్నం తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వర్లు,ఏపీవో మంగమ్మ, పంచాయితీ కార్యదర్శి అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.