ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన సర్పంచ్ లింగారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని వగరూరు గ్రామంలో పంచాయతీ నిధులు రూ 2 లక్షల తో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను సర్పంచ్ లింగారెడ్డి, వీరారెడ్డి లు బుధవారం ప్రారంభించారు. గత రెండు నెలల క్రితం రిపేరు కావడంతో గ్రామ ప్రజలు స్వచ్ఛమైన నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తెలిపారు. మరమ్మతులు చేసి మరల స్వచ్ఛమైన నీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చిన్నన్న, డీలర్ నరసింహులు, హరి, నరసింహులు ఎస్సి కాలనీ ప్రజలు పాల్గొన్నారు.