రోళ్లపాడు సర్పంచ్..టీడీపీ లో చేరిక
1 min readనాకోసం కాదు మీకోసం రాజకీయం చేస్తున్నా:ఎంపీ శబరి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు వైసీపీ గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి మరియు ఈయన సోదరుడు బరక సంజీవరాయ స్వామి ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళీ మోహన్ రెడ్డి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చిన ఎంపీ శబరికి ఊరేగింపుగా మేళ తాళాల నడుమ పూల వర్షంతో సర్పంచ్ ఘన స్వాగతం పలికారు.తర్వాత సర్పంచ్ కు మరియు మురళీమోహన్ రెడ్డితో పాటు 300 మందికి పసుపు కండువా కప్పి ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాకోసం రాజకీయం చేయడం లేదు మీకోసం నేను రాజకీయాలు చేస్తున్నానని గత ఐదేళ్లలో ప్రతి గ్రామానికి కేంద్ర నిధులు వస్తూ ఉన్నాయి కానీ గ్రామాల్లో ఒక్క పైసా పని జరగలేదని కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే యువత ఉద్యోగ కల్పన కోసం వందల కంపెనీలు తీసుకొచ్చారని అన్నారు. గ్రామాల్లో స్మశాన వాటికలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేక రాశానని అందరం కలిసి ముందుకు వెళుతూ గ్రామాలను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. నేటికీ మా నాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయని ఇంతవరకు ఎవ్వరూ కూడా పనులు చేయలేదన్నారు. తర్వాత టిడిపి సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ చేయాలని రాష్ట్రంలోనే మన నియోజకవర్గ 10 వ స్థానంలో ఉంది ఇంకా బాగా సభ్యత్వం చేసి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేయాలని ఎంపీ అన్నారు. గ్రామంలో స్మశానవాటిక కు మరియు గ్రామ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,ఉదారు రమణారెడ్డి,సీతారామిరెడ్డి,శ్రీనివాసరెడ్డి,భగీరథరెడ్డి, తిమ్మారెడ్డి,సత్యం రెడ్డి,నాగేశ్వరరావు,మాణిక్ రాజ్,మహేష్,నవాజ్ అలీ, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.