మా ప్రభుత్వంలో సర్పంచ్ లకు గౌరవం..
1 min readశాతన కోట..మల్యాల లో అభివృద్ధి పనులకు భూమి పూజ
నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్త
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ లకు గౌరవం పెరిగిందని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండలం మల్యాల,శాతన కోట గ్రామాల్లో ఆదివారం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సీసీ రహదారి పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి నిధులు ఇవ్వడంతో గ్రామాల్లో అభివృద్ధి బాటలు పట్టాయని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎజెండా అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో రోడ్లు వేసినవారు రోడ్డు పాలయ్యారని వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకోవడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి చేసింది లేదన్నారు.పల్లె పండుగ అనే కార్యక్రమంతో నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు మొదటి విడతగా రూ,12 కోట్ల ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.ఒక్కొక్క మండలం రూ, 2.50కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.అనంతరం పలువురు మహిళలు గ్రామంలోని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మల్యాల సర్పంచ్ ఉమాదేవి,శాతన కోట సర్పంచ్ జనార్ధన్ గౌడు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ, ఈఓఆర్డీ రంగనాయక్,పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు,ఏపీఓ అలివేలు మంగమ్మ,ఏపీఎం శ్రీనివాసులు,ఎంపీటీసీ చిన్న సుబ్బయ్య,చింతకుంట నారాయణ,మాజీ సర్పంచ్ స్వాములు,మహమ్మద్ ఖాద్రీ, సాహెద్ జలీల్ బాష,అక్బర్ బాష,సలీమ్,ఖాదర్,సలామ్, వెంకటేశ్వర్లు,వెంకట రెడ్డి, రామకృష్ణ,గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.