సుస్థిర వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న సర్వేశ్వర్ ఫూడ్స్ లిమిటెడ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్ఎంసిజి రంగంలో అభివృద్ధి చెందుతున్న సంస్థ మరియు హిమాలయ పాద ప్రాంతాలనుండి ప్రీమియం బాస్మతి రైస్‌కి ప్రాచుర్యం పొందిన సర్వేశ్వర్ ఫూడ్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 543688, ఎన్ ఎస్ ఈ : సర్వేశ్వర్), భారత వ్యవసాయ రంగంలో సస్టైనబుల్ విధానాల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఈ సంస్థ ప్రారంభించిన మట్టి మ్యాపింగ్ కార్యక్రమం రైతుల సాధికారత, దిగుబడుల పెంపు, భవిష్యత్ సరఫరా గొలుసు బలోపేతానికి కేంద్రబిందువుగా ఉంది.సర్వేశ్వర్ ఫూడ్స్ చేపట్టిన ఈ మట్టి మ్యాపింగ్ కార్యక్రమం దశలవారీగా 1,000 ఎకరాలకు పైగా బాస్మతి పండించే ప్రాంతాల్లో అమలవుతోంది. ఆర్.ఎస్. పురా, పాలన్వాల్లా, పార్గావాల్, బిష్ణా వంటి ప్రాంతాల రైతులకు మట్టి ఆరోగ్య పత్రాలు అందించి, ఎరువులు మరియు నీటిపారుదల పద్ధతులపై శాస్త్రీయ మార్గదర్శకాలను అందిస్తోంది. ఈ విధానం మట్టిని రసాయనాల వల్ల కలిగే హానికీ రక్షిస్తూ, ఆహార ధాన్యాల నాణ్యతను పెంచుతుంది.మరింతగా, సంస్థ ఆర్గానిక్ బాస్మతి ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఆర్గానిక్ సాగు పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచుతాయి, అలాగే పంటల నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు, పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి వివిధ పంటలను ప్రవేశపెట్టి వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పరచి రైతులకు న్యాయమైన ధరలతో పాటు అవసరమైన వనరులు అందిస్తోంది.యు ఎస్ డి 5.84 మిలియన్ల విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందడం సంస్థ విజయవంతమైన అగ్రస్థాయి సామర్థ్యానికి నిదర్శనం.సర్వేశ్వర్ ఫూడ్స్ నాణ్యత ప్రమాణాలు, ఐఎస్ఓ 22000:2018, యూఎస్ఎఫ్డీఏ మరియు ఇతర అంతర్జాతీయ ధృవపత్రాలతో సహా ‘సత్విక’ జీవనశైలిని ప్రమోట్ చేసే ఉత్పత్తులను అందిస్తోంది. సంస్థ ‘నింబార్క్’ బ్రాండ్ ద్వారా ప్రీమియం ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తోంది.