భక్తి శ్రద్ధలతో “సత్యనారాయణ స్వామి” వ్రతం!
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పౌర్ణమి సందర్భంగా పత్తికొండ పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఉదయం పట్టణంలోని సబ్ జైలు దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో, రామచంద్రపురం గ్రామంలోని సీతారాముల దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమాలను ఆయన దేవాలయాల అర్చకులు సత్యనారాయణ స్వామి, శ్రీకాంత్ ఆచారి, నాగరాజరావుస్వామి చేశారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజ ఆవశ్యకతను, మహత్యాన్ని అర్చకులు భక్తులకు వివరించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొంటే సంపద, విద్య, శ్రేయస్సు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం వంటివి కలుగుతాయని తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రత పూజ నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.తీర్థప్రసాదాలు అందజేశారు.
పెద్దమ్మ దేవాలయంలో…:
పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న శ్రీ పెద్దమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఉదయం అమ్మవారికి అర్చనలు, అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతినెల పౌర్ణమికి పెద్దమ్మఅవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పెద్దమ్మవ్వను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవాలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.