PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ  పాఠశాలలను కాపాడండి – ఆప్టా

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని  ప్రభుత్వ పాఠశాల ల యందు విద్యార్థుల సంఖ్య సంవత్సరం నకు సంవత్సరమునకు గత ఐదు సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది. దానికి ముఖ్య కారణం లు రెండు.ప్రభుత్వం 117 ఉత్తర్వులు ద్వారా 3,4మరియు 5తరగతులు విలీనం చేయటం ద్వారా ప్రాథమిక పాఠశాల లు 1మరియు 2తరగతుల మాత్రమే వున్నాయి.అది కూడా ఒకరు లేక ఇద్దరూ టీచర్ల తో మాత్రమే.ఈ విధంగా వున్నప్పుడు తల్లి తండ్రులు సాధారణంగా ఒకటి నుండి ఐదు తరగతులు వున్న ప్రవేటు పాఠశాల వెైపు చూస్తున్నారుదానికి తోడు ప్రవేటు పాఠశాల వారు ధమాకా ఆఫర్ ఇస్తున్నారు. అమ్మ ఒడి డబ్బులు వచ్చినప్పుడు ఫీ కట్టండి. ఇప్పుడు పుస్తకాలు మరియు మెటీరియల్ డబ్బులు మాత్రమే కట్టండి.ఈ విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభత్వ ప్రాథమిక పాఠశాల లో గణనీయంగా నమోదు తగ్గిపోతుంది. కాబట్టి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వా ఉత్తర్వు లు 117 ను రద్దు చేసి వెంటనే 3,4 మరియు 5 తరగతులను మరల ప్రాథమిక పాఠశాలలోకి తరలించాలి.117లో మూడు కిలో మీటర్ల లోపల అని వున్నది. గత ప్రభుత్వ హయం లో ఒక కిలో మీటరు దూరంలో వున్న పాఠశాల లను విలీనం జరపగా వచ్చిన వ్యతిరేకత చూసి మూడు కిలో మీటర్ల దూరం పోలేదు.తల్లికి వందనం పథకం ను ప్రభుత్వ పాఠశాల లో చదివే వారికీ మాత్రమే అమలు పరచాలి. నెల వారి ప్రవేటు పాఠశాల ఫీజు లు కట్టడానికి సిద్ధపడి ప్రవేట్ పాఠశాల లో చేర్పించిన వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఓట్ల రాజకీయం మాత్రమే,అది కూడా పని చేయలేదు అనే విషయం గత ఎన్నికల ఫలితాలు తెలిపాయి.తల్లికి వందనం అది కూడా ఒకసారి ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నెలవారీ విద్యార్థి హాజరు ఆధారంగా వారి ఖాతా లకు జమ అయ్యే విధానం లో అమలు చేయాలని తద్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లను నమోదు పెరుగుతుంది . నేడు అసెంబ్లీ లో గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ పాఠశాల తో పాటు ప్రవేటు పాఠశాల లో చదివే వారికి తల్లికి వందనం అమలు చేస్తాం అని చెప్పారు ఈ విషయం లో వారు పునరాలోచన చేయవలసినది గా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు పత్రిక ముఖంగా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నేతల ఒంటెద్దు పోకడల వలన అపశయ్య పై ఉన్న ప్రభుత్వ పాఠశాల లను కాపాడాలి అంటే తల్లికి వందనం పథకం ను ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వర్తింపచేయాలి అని వారు అన్నారు.

About Author