పొట్టను తొలగించి మహిళ ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు
1 min readకడుపులో క్యాన్సర్.. విజయవంతంగా చికిత్స
తక్కువ ఖర్చుతో చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: కడుపులో క్యాన్సర్ వచ్చి, మొత్తం కడుపునే తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి సంక్లిష్టమైన కేసు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ తెలిపారు. “అనంతపురం జిల్లా సెట్టూరు మండటం యతకల్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల గొల్ల చిక్కమ్మ అనే సాధారణ గృహిణికి చాలా కాలం నుంచి ఆకలి లేకపోవడం, అన్నం తినకపోవడం, విపరీతమైన గ్యాస్ సమస్య ఉండటంతో ఆమె కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడకు వచ్చేసరికి ఆమె కేవలం 30 కిలోల బరువు మాత్రమే ఉన్నారు. ముందుగా ఆమెకు ఎండోస్కొపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు చేయగా, ఆమెకు కడుపులో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి, కడుపు భాగం మొత్తం తొలగించాల్సి వచ్చింది. దాంతోపాటు లింఫ్‌నోడ్స్ కూడా తీసేశాము. శస్త్రచికిత్స చేసిన తర్వాత తొలగించిన భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా.. ఆమెకు రెండో దశ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. పూర్తిగా కడుపు భాగాన్ని తొలగించడంతో చిన్న పేగులను ఆహారనాళానికి కలపాల్సి వచ్చింది. కడుపు మొత్తం తీసేయడం వల్ల ఇక ఆమెకు రేడియేషన్ గానీ, కీమోథెరపీ గానీ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో వారం రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం.గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా సంక్లిష్ట సమస్యగా ఉన్నాయి. అత్యధికంగా వ్యాపించే క్యాన్సర్లలో ఐదో స్థానం, క్యాన్సర్ సంబంధిత మరణాల్లో మూడోస్థానం వీటిదే. ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి. అందువల్ల వీటికి సమర్థమైన చికిత్సా పద్ధతులు పాటించాలి. మొత్తం గ్యాస్ట్రిక్ క్యాన్సర్లలో 50% నుంచి 80% వరకు అడ్వాన్స్‌డ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు ఉంటున్నాయి. కానీ, ఇవి వచ్చినవారిలో సుమారు 35% నుంచి 51% మంది కెమోథెరపీకి స్పందించడం లేదు, 15% మందికి కణితులు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటికి అవసరాన్ని బట్టి కెమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోమాడ్యులేటరీ మందులు ఇచ్చి చికిత్సలు చేయాలి. ఇవి కూడా రోగుల పరిస్థితిని బట్టి ఎవరికి కావల్సినట్లు వారికి ఇవ్వాలి. దీనివల్ల చికిత్సలో సమర్ధత పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఆహారం తీసుకోని రోగులకు ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడం చాలా కష్టం. కానీ, కిమ్స్ సవీరా ఆస్పత్రిలోని మెడికల్ ఆంకాలజిస్ట్. విష్ణుప్రియాంక మరియు ఇతర విభాగాలకు చెందిన వైద్య బృందం మొత్తం ఈ కేసును సవాలుగా స్వీకరించి, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేసింది. కడుపు భాగం తొలగించి, ఆహార నాళాన్ని చిన్న పేగులతో కలపడం వల్ల భవిష్యత్తులో ఆహారం మాత్రం కొద్దికొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువసార్లకు బదులు ఎక్కువసార్లు, కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాఉట జీవితాంతం పోషకాహార సప్లిమెంట్లు, కాల్షియం కూడా ఉపయోగించాలి” అని డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రిలో కేవలం రూ. 1.5 లక్షలకే పూర్తి చేయడం మరో విశేషం.అనంతరం కిమ్స్ సవీర సీఇఓ. పి. శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న జీవిన శైలిలో భాగంగా అన్ని రకాలకన్నా.. ఎక్కువున్న ఉన్న జబ్బుల్లో క్యాన్సర్ రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. లైఫ్ స్టైల్ వ్యాధుల తర్వాత ఈ క్యాన్సర్ ఉందన్నారు. ఒకప్పుడు అనంతపురంలో హార్ట్ఎటాక్ వస్తే.. బెంగుళూరు, హైదరాబాద్ తీసుకవెళ్తుండగానే ఎంతో మంది మరణించారు. అనంతపురంలో మొట్టమొదటిసారిగా హార్ట్ ఎటాక్ రోగులకు రక్షించడానికి అత్యాధునిక వైద్య సేవలు ప్రారభించి ఎంతో మంది ప్రాణాలు కాపాడమన్నారు. ఇప్పుడు క్యాన్సర్ కూడా చికిత్స చేసి వైద్యులు రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండటం యతకల్ గ్రామానికి చెందిన రోగి గొల్ల చిక్కమ్మ మాట్లాడుతూ మేము కర్నాటకలోని అనేక ఆస్పత్రులను తిరిగాం, కానీ ఎక్కడ కూడా మాకు సరైన వైద్యం చేయలేదు. కిమ్స్ సవీర వచ్చిన తర్వాత డాక్టర్లు మాకు మంచి వైద్యం అందించి చనిపోతా అనుకున్న నన్ను బ్రతికించారు. డాక్టర్లకు, హాస్పిటల్ యాజమాన్యాన్నికి రుణపడి ఉంటాం.