మనందరికీ సావిత్రిబాయి పూలే ఆదర్శనీయం : పాఠశాల హెచ్ఎం భ్రమరాంబ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సంఘసంస్కర్త, మహిళా చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే మనందరికీ ఆదర్శనీయమని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ అన్నారు. శుక్రవారం పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమాబి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ, ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతులను రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమ కారిణి సావిత్రిబాయి పూలే అని ఆమె తెలిపారు. భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి సమ సమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని చెప్పారు .ప్రతి స్త్రీ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని సామాజిక చైతన్యం కోసం ,స్త్రీ విద్య కోసం పాటుపడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.