ఎస్సీ వర్గీకరణ తీర్పు చెల్లదు… పునః పరిశీలించాలి…
1 min read( మాల మహానాడు ) ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన …..మాల మహానాడు
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల సంఘాల నాయకులు మురహరి మల్లయ్య పీకేశాలు ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో గంట పైబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా నాయకులు మురారి మల్లయ్య మల్లె ఎలీషా పీ కేశాలు ఎస్సీ ఎస్టీ మార్జిన్ కమిటీ సభ్యులు దిలీప్ కుమార్ లాయర్ చింతలయ్య మండల అధ్యక్షులు సుధాకర్ మొదలగువారు మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టు వేసిన ఇదే అత్యున్నత న్యాయస్థానం నేడు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏ విధంగా వర్గీకరణ సమంజసం అని తీర్పు ఇచ్చిందో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కనుసాన్నల్లోనే తీర్పు వచ్చిందని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు గమనించాలని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించింది వెనుకబడిన ఎస్సీల వర్గానికి చేయూత అందించి అభివృద్ధి పరచడానికేనని ఈ రిజర్వేషన్లను మళ్లీ వర్గీకరించడం ఏమిటని ఇందులో కూడా మరలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని వర్గీకరించడం సరైంది కాదని అన్నారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వారి రిజర్వేషన్లను ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరించడం సరైంది కాదని అన్నారు 2004లో ఐదుగురు సభ్యులు ధర్మాసనం ఇచ్చిన చెల్లదు అంటూ ఇదే ధర్మాసనం సంచలం తీర్పించిందని ఇప్పుడు మళ్లీ ఏడుగురు సభ్యుల ధర్మాస్త్రంతో వర్గీకరిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి అన్నారు ఏడుగురు సభ్యులలో ఆరుగురు అనుకూలంగా తీర్పును ఇవ్వడం జరిగిందని ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ ఎం బేల త్రివేది న్యాయవాది వర్గీకరణ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు అన్నారు ఇప్పటికైనా మాల సోదరులు ఆదిపత్య కులాల మత్తులో నుండి బయటికి వచ్చి మన జాతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ ఐక్యంతో పోరాటలకు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరడమైనది నిరంతరం పోరాటం కొనసాగడానికి భవిష్యత్తు ప్రణాళికను తెలియజేస్తామని తెలిపారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు గారు సోమవారం నాడు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు క్రిస్టఫర్ పాతకోట భాస్కర్ రాఘవేంద్ర అంకిరాజు అనితారావు సకనాల సురేష్
పాములపాడు నాయకులు అంకన్న రాజు నగేష్ పాములపాడు కొత్తపల్లి ఆత్మకూరు మండలాల నుండి మాల మహానాడు నాయకులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైనది.