ఎస్సీ హాస్టల్లు పునః ప్రారంభించాలి… ఏఐఎస్ఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో పునః ప్రారంభించాలని హోళగుంద మండల ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన “మండల సర్వసభ్య సమావేశంలో ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుసేని వీరుపాక్షి కి” వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం శాసనసభ్యులు “బుసేని వీరుపాక్షి “సానుకూలంగా స్పందిస్తూ జిల్లా కలెక్టర్ కి దృష్టికి జిల్లా ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏఐఎస్ఎఫ్ నాయకులు సానుకూలంగా స్పందించడం జరిగింది.88.లక్షలు ఖర్చుపెట్టి హాస్టల్ భవనం నిర్మించిన విద్యార్థులకు ఉపయోగపడని ఎస్సి హాస్టల్ఎస్సీ హాస్టల్ మూత పడడంతో పేకాట రాయులకు తాగుబోతులకు అడ్డగా మారిన ఎస్సీ హాస్టల్.హాస్టల్లో ఉన్న చెట్లను సైతం నరికి వేస్తున్నారు.ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం ఎంతవరకు సమంజసం.గత 06 సంవత్సరాల నుండి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం.మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శి సతీష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కాకి గాదిలింగ మాట్లాడుతూ హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో దాదాపుగా 06 సంవత్సరాల క్రితం హాస్టల్లో మూసి వేయడం జరిగింది అప్పటినుండి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ మండల స్థాయి అధికారుల నుండి జిల్లా ఉన్నంత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు మాత్రం నిద్రమత్తులో నుండి బయటకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అత్యంత వెనుకబడిన మండలం మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో కూడా మూసివేయడంతో విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోలేక విద్యకు దూరమై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హాస్టల్లో వసతి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఈ మండలానికి ఏర్పడింది. అక్కడ కూడా తమకు సీటు వస్తుందో రాదో అని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఒకవేళ సీటు తమకు రాకపోతే విద్యను అక్కడితో ఆపేస్తున్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు అందరూ దృష్టిలో పెట్టుకుని ఎస్సీ హాస్టల్లో పున ప్రారంభించవలసిందిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గా డిమాండ్ చేస్తున్నాం లేనియెడల అధికారులు కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నామని అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నాగరాజు శామ్యూల్ రాజ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.