ఎస్సీ హాస్టల్లు పునః ప్రారంభించాలి…ఏఐఎస్ఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో పునః ప్రారంభించాలని హోళగుంద మండల కేంద్రానికి వచ్చినటువంటి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసేని విరుపాక్షికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ మండల అధ్యక్షుడు కాకి గాదిలింగ వినతి పత్రం సమర్పించడం జరిగింది.సానుకూలంగా స్పందించిన ఆలూరు ఎమ్మెల్యే బుసేని విరుపాక్షి జిల్లా కలెక్టర్ కి జిల్లా ఉన్నంత విద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా విద్యార్థులకు ఎస్సీ హాస్టల్ లో పునః ప్రారంభించే విధంగా అధికారులతో మాట్లాడతానని వారు ఏఐఎస్ఎఫ్ నాయకులకు తెలియజేశారు.88.లక్షలు ఖర్చుపెట్టి హాస్టల్ భవనం నిర్మించిన విద్యార్థులకు ఉపయోగపడని ఎస్సి హాస్టల్.ఎస్సీ హాస్టల్ మూత పడడంతో పేకాట రాయులకు తాగుబోతులకు అడ్డగా మారిన ఎస్సీ హాస్టల్.ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం ఎంతవరకు సమంజసం.గత 06 సంవత్సరాల నుండి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం.మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షలు కాకి గాదిలింగ మాట్లాడుతూ హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో దాదాపుగా 06 సంవత్సరాల క్రితం హాస్టల్లో మూసి వేయడం జరిగింది అప్పటినుండి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ మండల స్థాయి అధికారుల నుండి జిల్లా ఉన్నంత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు మాత్రం నిద్రమత్తులో నుండి బయటకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అత్యంత వెనుకబడిన మండలం మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో కూడా మూసివేయడంతో విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోలేక విద్యకు దూరమై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హాస్టల్లో వసతి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఈ మండలానికి ఏర్పడింది. అక్కడ కూడా తమకు సీటు వస్తుందో రాదో అని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఒకవేళ సీటు తమకు రాకపోతే విద్యను అక్కడితో ఆపేస్తున్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎస్సీ హాస్టల్లో పున ప్రారంభించవలసిందిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గా కోరుతున్నాం.