అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి..
1 min readఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని తక్షణమే అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆలూరు పోలిస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగ రూపకర్తలలో ప్రధాన భూమిక పోషించిన అంబేద్కర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, దేశంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాలకు ఆజ్యుడైన ఆదాని పై విచారణ కోరుతూ ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు మంత్రులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంబలబీడు లక్ష్మన్న, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, మల్లికార్జున, రామాంజనేయులు, మీసాల గోవిందు, వీరాంజనేయులు ఎమ్మార్పీఎస్ పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గూల్యం యల్లప్ప, ఉపాధ్యక్షులు హోళగుంద వెంకటేష్, శాసం రామాంజనేయులు, ఎల్లార్థి మహేష్, గజ్జేహల్లి తాయన్న, కోగిలతోట వీరేష్, బాపురం మోషే, విరుపాపురం బసవరాజు, మార్లమడికి రంగన్న, హులేబీడు రామలింగ, వినిత్ మరియు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.