షెడ్యూల్డ్ క్యాస్ట్ కులగనన సోషల్ ఆడిట్ జాబితా అస్తవ్యస్తం
1 min readసమగ్ర విచారణ ద్వారా ఎస్సీ జాబితా ను రూపొందించాలని కురువ సంక్షేమ సంఘం డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన షెడ్యూల్డ్ క్యాస్ట్ కులగనన సోషల్ ఆడిట్ లో ప్రచురించిన ఎస్సీ కుల జాబితా అస్తవ్యస్తంగా ఉందని సమగ్ర విచారణ ద్వారా తిరిగి ఎస్సీ జాబితాను రూపొందించాలని మదాసి మదారి కురువ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.ఈ జాబితాలో 70 శాతం మంది అనర్హులు ఎస్సీలుగా నమోదు అయ్యారని తెలిపారు. ఇండియన్ హిందూ మాదిగ, హిందూ మాల అనబడే ఎస్సీలవారు గత 50 సంవత్సరాలుగా క్రిస్టియన్లుగా మారి, చర్చిలు నిర్మించుకుని పాస్టర్లు గా అవతారం ఎత్తి క్రైస్తవ మత వ్యాప్తికి దోహద పడుతున్నారని తెలిపారు. ఇండియన్ క్రిస్టియన్ గా మారిన వారికి బీసీసీగా పరిగణించాలని గజిట్లో ఉన్నప్పటికీ అలాకాకుండా ఎస్సీ మాల మాదిగలు క్రిస్టియన్లుగా చలామణి అవుతూ షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లను యదేచ్చగా ప్రయోజనాలు పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే విదేశాల నుండి వచ్చే నిధులతో క్రిస్టియన్ చర్చిలు నిర్మిస్తూ పాస్టర్లుగా చలామణి అవుతూనే షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ పథకాల్లోనూ, ప్రభుత్వ కొలువుల్లోనూ, కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అక్రమంగా అనుభవిస్తూ, అసలైన ఎస్సీలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ సోషల్ ఆడిట్ కులగనన జాబితాను సమగ్ర విచారణతో రూపొందించాలని కోరారు. అసమగ్రంగా రూపొందించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ సోషల్ ఆడిట్ జాబితాను పూర్తిస్థాయిలో విచారణ.