PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది పథకాలు ఇంటికి నేరుగా చేరుతున్నాయి

1 min read

కాటసాని రాంభూపాల్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  అభివృద్ధి అంటే ఎన్నికల అప్పుడు వచ్చి ఓట్లు అడగడం కాదని నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలు టిడిపి వైపు లేరని వైసిపి ప్రభుత్వ హయాంలో నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందని టిడిపి కల్లబొల్లి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని  జగన్మోహన్ రెడ్డి ని సీఎంగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని 13వ తేదీ వాళ్ళ ప్రేమను వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి పట్టం కడతారని సోమవారం నాడు గని మంచాలకట్ట గ్రామంలో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి రోడ్ షో  నిర్వహించారు చెప్పిన మాట తప్పకుండా అన్ని అభివృద్ధి పథకాలను అమలు చేశామన్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అందరికీ న్యాయం జరిగిందని కూటమి ఓటమి ఖాయమన్నారు ప్రజలకు నాయకులతో అవసరం లేదని కాలం చెల్లిందన్నారు ప్రభుత్వం నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం పుట్టిన పిల్లాడు దగ్గరనుంచి అవ్వ తాతలకు అన్ని పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వాన్నిదేనని మరొక్కసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అయినా తనకు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు స్థానిక నాయకుడు ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామాలకు కేటాయించిన నిధులను దిగమింగీ అభివృద్ధి లేకుండా చేశారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గారి చొరవతో సోలార్ నిధులు సాధించి గని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని ఎవరు ఏమన్నా నా గ్రామానికి నాయకుడిలా కాకుండా సేవకుడిలా పనిచేశానని ఇక ప్రజలే నిర్ణయించాలన్నారు  ఎమ్మెల్యే వద్ద కొట్లాడి నిధులు సాధించే సత్తా తనకు ఉందని ప్రజలు గమనించాలన్నారు కల్లబొల్లి మాటలను నమ్మి టిడిపికి ఓటు వేస్తే చేటు తెచ్చుకుంటారని అభివృద్ధి ఆగిపోతుందన్నారు నిధులు సాధించడం కంటే స్థానిక నాయకులు దిగమింగడానికి అలవాటు పడ్డారని కళ్ళముందే గని గ్రామంలో అభివృద్ధి కనపడుతుందని ప్రతి వర్గానికి వారి సమస్యలను పరిష్కరించి ఎమ్మెల్యే  చొరవతో నిధులు సాధించి అభివృద్ధి సాధించానన్నారు ప్రతిపక్ష నాయకులు విమర్శలకు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేశారని గ్రామాలలో నాయకులందరూ ఏకమై అన్ని గ్రామాలు అభివృద్ధి చెందటమే లక్ష్యంగా పెట్టుకుని మంచాలకట్ట చెరువు నుండి గని గ్రామ రైతుల కోసం తూము ఏర్పాటు చేయాలని చూస్తే అడ్డుకున్నారని ఎవరెన్ని మాటలన్న తగ్గేదే లేదని మంచాల కట్ట గ్రామాన్ని అనిల్. మేఘుడు. నేను కలిసి దత్తత తీసుకుంటామని అభివృద్ధి అంటే ఏదో చూపిస్తామని సవాల్ విసిరారు  గ్రామం నుండి గడివేముల మండల కేంద్రం వరకు ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో రహదారి నిర్మించినట్టు తెలిపారు స్థానికంగా ఇక సమస్యలు ఏమున్నాయని అన్ని సమస్యలు తీర్చాక తమకు ఓటు వేయాలని టిడిపి నాయకులు గ్రామాల్లో ప్రజలకు అభ్యర్థిస్తున్నారని ప్రజలు నమ్మేస్థితిలో కచ్చితంగా మళ్ళీ వైసిపి ప్రభుత్వం వస్తుందని జగనన్న ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సంబరాలు చేసుకోవడానికి జూన్ 5వ తేదీ సిద్ధంగా ఉండాలని మళ్లీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవ్వతాతలకు ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మేఘనాధ్ రెడ్డి మాట్లాడుతూ.రైతులకు పొలాలకు రహదారి వేశామని చెరువు మరమ్మత్తు చేశామని పొలాలకు నీళ్లు అందించామని టిడిపి నాయకుల పొలాలకు కూడా నిరందంచిన ఘనత ఎంఎల్ఏ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఘనత అని టిడిపి హయాంలో ఏకరకు నీరు అందించార నిరూపిస్తే టిడిపి పార్టీ కి గంపగుత్తగా ఓటు వేస్తామని టిడిపి స్థానిక నాయకులు  ఎన్నికలప్పుడు గ్రామానికి వస్తారని ఎన్నికలైపోగానే వెళ్ళిపోతారని సర్పంచ్ గా పని చేసిన టిడిపి నాయకుడు గ్రామంపై ప్రేమ ఉంటే గ్రామంలో అభివృద్ధి ఎక్కడ చేశారని మేము వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించమని టిడిపి నాయకుల పని అయిపోయిందని ఈ ఎన్నికలలో ఓటు ద్వారా మీకు ప్రజలు చెక్ పెడతారని మళ్ళీ వచ్చేది వైసిపి ప్రభుత్వం అన్నారు.. ఆనందరెడ్డి, మేఘనాథ్ రెడ్డి ,అనిల్ కుమార్ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు శివరామిరెడ్డి, జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, గని సర్పంచ్ కత్తి తులసమ్మ, సొసైటీ చైర్మన్ పోగుల చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాలు నాయక్, ఉండుట్ల రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, రఘు మాధవరెడ్డి, గడివేముల ఉప సర్పంచ్ బాల చిన్ని, దేశం సంజీవరెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి ,సివి రమణయ్య,దస్తగిరి రెడ్డి, కత్తి శ్రీధర్,వైసిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author