బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి … ఎంఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అలాగే జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు విద్యప్రవేశము, నేను బడికి పోత అనే కార్యక్రమం పై జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యప్రవేశము అనే కార్యక్రమమును గత 5 సంవత్సరాలనుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది అదేవిధంగా విద్యార్థులకు బోధన విధానం ఎలా ఉంది, అనే విషయాలపై దీక్ష యాప్ లో అప్లోడ్ చెయ్యాలని తెలిపారు, మండల విద్యాశాఖ అధికారి- 2 సునీత జిల్లా అకాడమిక్ నానిటరీ అధికారి రామాంజనేయరెడ్డి లు మాట్లాడుతూ,నేను బడికి పోత అనే కార్యక్రమం లో బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని దీనిపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమ్యూనిటీ మొబైల్ అధికారి దశరద రామిరెడ్డి, ఏ ఎల్ ఎస్ సి ఓ విశ్వనాధ్ రెడ్డీ, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.