మిడుతూరులో ప్రశాంతంగా పాఠశాల కమిటీ ఎన్నికలు
1 min readకొన్నిచోట్ల పోటీ మరికొన్ని చోట్ల ఏకగ్రీవం..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గురువారం జరిగిన పాఠశాల అభివృద్ధి కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు కమిటీ మెంబర్లను కొన్ని గ్రామాల్లో ఎన్నికల పోటీ ద్వారా మిగతా గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ లుగా ఎన్నికైన వారిలో:మిడుతూరులో జడ్పీహెచ్ఎస్ మరియు ప్రాథమిక పాఠశాలలకు నాగేశ్వర్ రెడ్డి,ఏ రాజు, సుబ్బమ్మ నాగలూటిలో కురువ శ్రీరాములు,దేవనూరు మదన్ గోపాల్,అన్వర్ భాష,ఘని భాష,తలముడిపిలో షాషావలి,ప్రకాశం,నూరుల్లా చెరుకుచెర్లలో శ్యామరాజు, కడుమూరులో మునీర్ భాష, మధుకృష్ణ,కలాం భాష, రోల్లపాడులో బి సంజన్న, జలకనూరులో కుమ్మరి మహేష్,పీరుసాహెబ్ పేటలో డి శివ బాలరాజు, బైరాపురంలో మొల్ల రబ్బానీ వీరు ఆయా పాఠశాలలకు నూతన చైర్మన్ లుగా ఎన్నికయ్యారు. వీరందరిని మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,కాత విష్ణువర్ధన్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి మద్దిలేటి రెడ్డి,సోమ సుందర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి బూత్ ఇన్చార్జి వెంకటేశ్వర రెడ్డి ఇద్రిస్ సుధాకర్ రెడ్డి,చాకర్ వలి, మాజీ సర్పంచ్ లు నాగేంద్రుడు,రామస్వామి రెడ్డి మరియు ఆయా గ్రామాల నాయకులు నూతన కమిటీ సభ్యులను పూలమాలలతో ఘనంగా అభినందించారు. నాగలూటిలో నూతన చైర్మన్ కురువ శ్రీరాములు మరియు కమిటీ మెంబర్లు నాయకులు సంపంగి రవీంద్రబాబు రమణారెడ్డి బాబుసాహెబ్ నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య లను అల్లూరులో వారిని పూలమాలలతో సత్కరించారు.పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది ఉన్నారు.అన్ని గ్రామాల్లో ఎక్కువగా టిడిపి నాయకులు బలపరిచిన అభ్యర్థులే చైర్మన్లుగా ఎన్నికయ్యారు.పాఠశాల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మిడుతూరు ఎస్ఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో గ్రామాలను పర్యవేక్షించారు.