వట్లూరులో జిల్లా స్థాయి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సైన్స్ ఎగ్జిబిషన్
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న జిల్లా గురుకుల విద్యాలయాల విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గణిత,సామాన్య, సాంఘిక శాస్త్రం మరియు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో విద్యార్థులకు ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ (ఫ్యూచర్ ఆన్ -2024)ఏలూరు జిల్లా వట్లూరులో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో జిల్లాలో గల అన్ని గురుకుల విద్యాలయాలనుండి వివిధ విద్యార్థులు పెద్ద ఎత్తున విచ్చేసి తమ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అధ్యాపకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రతి విభాగం నుండి మొదటి రెండు బహుమతులను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా డి.సి.ఓ ఎన్. భారతి, పెదపాడు ఎం.ఈ.ఓ -2 డి.వి రమణ, కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.