PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు విజయవంతం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 25 వ తేదీన అనగా బుధవారం రోజున చెకుముకి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని కావున ఈ అవకాశాన్ని మండలంలోని 8,9,10 తరగతుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనవిజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ పిలుపునిచ్చారు. ఏనుగు మర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ అధ్యక్షతన మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాలుగా ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను రూపుమాపే లక్ష్యంతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని కొనియాడారు.విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం,శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో,జిల్లా స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలో మండల వ్యాప్తంగా ఉన్న 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో చదివే 8,9,10 తరగతుల విద్యార్థులను టాలెంట్ టెస్ట్ పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను కోరారు.అనంతరం చెకుముకి పరీక్షల గోడ పత్రికలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి,జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జన విజ్ఞాన వేదిక నాయకులు సర్వజ్ఞ మూర్తి,ఉపాధ్యాయులు అంజనప్ప,సాలయ్య,షేక్షావలి,నరసింహయ్య,సోనీ,రామ లింగా రెడ్డి, రమేష్ నాయుడు,నెల్లూరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author