PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిడ్జ్ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక లక్ష్మీపురం సమీపములోని రిడ్జ్ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు .విద్యార్థులలో ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ఈ కార్యక్రమం యూనివర్సల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఢిల్లీ వారి భాగస్వామ్యంతో మరియు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్కౌట్స్ , జర్మనీ వారి సహకారంతో శ్రీమతి బిందియా త్యాగి, జాతీయ శిక్షణ కమిషనర్ మరియు ఆమె యొక్క బృందం పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు జీవన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థుల్లో, బృంద సహకారము, ఐకమత్యం, జాతీయతాభావం, ధైర్య సాహసాలను పెంపొందించడానికి మరియు విలువలతో కూడిన విద్యను స్నేహభావాన్ని దయా గుణాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించారు.పాఠశాల సీఈఓ గోపినాథ్  మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు క్లిష్ట పరిస్థితుల్లో తమ సామర్ధ్యాన్ని వినియోగించుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పిస్తుందని పేర్కొన్నారు. అంతేగాక బృంద సహకారం యొక్క ప్రాముఖ్యత ఈనాటి సాంకేతిక ప్రపంచంలో ఎంతటి ప్రముఖ పాత్ర వహిస్తుందో తెలియజేశారు. డీన్ రాజేంద్రన్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సమగ్రత భావాన్ని విధేయతను పరస్పర సహకారం ఇస్తూ వారికి స్వీయ అభివృద్ధి పొందడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రిన్సిపాల్ రాజ్ కమల్ గారు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క మానసిక మరియు ఉద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు.మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత బృంద సహకార కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత పరస్పర గౌరవ భావాన్ని పెంపొందించి విద్యార్థులలో జాతీయతా భావాన్ని పెంపొందించడానికి స్కార్ఫ్ సెర్మని నిర్వహించారు.ఇందులో భాగంగా జాతీయ ఆవిష్కరణ మరియు జాతీయత భావాలను పెంపొందించే పాటను ఆలపించారు. తరువాత హ్యూమన్ స్ట్రక్చర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గాయపడిన వ్యక్తికి ప్రధమ చికిత్స ఎలా అందించి కాపాడాలో విద్యార్థులకు బోధించారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా టెంట్ పిచ్చింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సొంతంగా షెల్టర్ వేసుకుని తమను తాము ఎలా రక్షించుకోవాలని విషయాన్ని బోధించారు. అంతేగాక ఒత్తిడిని ఎలా అధిగమించాలో విద్యార్థులకు బోధించారు. చివరగా విద్యార్థులలో తమను తాము ఎలా కాపాడుకోవాలో ఇతరులకు ఎలా సహాయం చేయాలో తదితర విషయాలను బోధించారు. ఈ కార్యక్రమం ద్వారా రిడ్జ్ పాఠశాల విద్యార్థులు ఎన్నో విలువలను క్రమశిక్షణను స్వీయ అభివృద్ధిని పొందారు.

About Author