ఘనంగా ఎస్ డి పి ఐ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం స్థానిక హోలగుంద మండలంలో SDPI సోషీయల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా స్టేట్ కమిటీ మెంబర్ అబ్దుల్ హమీద్ జెండా ఆవిష్కరణ చేశారు తదనంతరం వారు మాట్లాడుతూ ఎస్ డి పి ఐ పార్టీ 23 రాష్ట్రాలలో ఉందని 14 రాష్ట్రాలలో బలంగా పని చేస్తుందని పార్టీ యొక్క నినాదం భయం నుండి స్వేచ్ఛ ఆకలి నుండి స్వేచ్ఛ దేశంలో ఎస్డిపిఐ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయం స్వేచ్ఛ రక్షణ అని అన్నారు మనదేశంలో ఏ కులం అయినా ఏ మతమైనా వారిపై దాడులు జరిగితే వెంటనే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఎస్ డి పి ఏ పార్టీ ముందు వరసలో ఉంటుందని అన్నారు అలాగే ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు కే అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ పార్టీ యొక్క ఉద్దేశాన్ని కట్టుబడి కార్యకర్తలు పనిచేస్తారని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలను కలుపుకొని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతారని అన్నారు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా అవినీతి రాజ్యాంగ విరుద్ధ విధానాలను విమర్శిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్త దేశ అభివృద్ధికి ప్రజాసేవకు అంకితభావంగా పనిచేయాలన్నారు.స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ కార్యకర్తలకు నిర్దేశించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ మెంబర్ ఎఫ్ ,అబ్దుల్ హమీద్ అసెంబ్లీ కమిటీ నాయకులు కే, అబ్దుల్ రహమాన్ t ,రహిమాన్ ఎస్ ఏం డి షఫీ రహంతుల్లా ఎం,బక్షి ,కే ,సలాం, ఉబెద్ , t, భాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.