PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SDR స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల :   గుట్టు చప్పుడు కాకుండా SDR స్కూల్ లోనే అంబులెన్సు పెట్టుకొని ప్రముఖ్య డాక్టర్ తో చికిత్స చేయించిన వైనంఈ రోజు ఉదయం వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందని సమాచారం. ప్రభుత్వ అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న SDR స్కూల్ ను సీజ్ చేయాలి. SDR స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి-అధికారులను డిమాండ్ చేసిన AISF నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ్ SDR వరల్డ్ స్కూల్ అని చెప్పుకుంటూ నిట్ట నిలువునా విద్యార్థులను,తల్లిదండ్రులను  మోసం చేస్తున్న SDR స్కూల్ యాజమాన్యంఏసీ క్యాంపస్ అని చెప్పుకుంటూ కేవలం ఒక చిన్న రూమ్ లో 30 మంది విద్యార్థులను రాత్రిపూట పడుకోవడానికి  అసౌకర్యంగా ఉంచి చిన్న ఏసీ మాత్రమే పెట్టినటువంటి పరిస్థితిSDR స్కూల్ హాస్టల్ పరిసర ప్రాంతాలు నిత్యం అపరిశుభ్రంగా ఉంటున్నటువంటి వైనం SDR స్కూల్ యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ అనుమతులు లేకుండా హాస్టల్ నడుపుతున్నందుకు, స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్  కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే  AISF ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమానికి సిద్ధమవుతాం, రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులను కూడా కలుస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కూడా ఫిర్యాదు చేస్తాం. నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు SDR స్కూల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన పైన సమగ్ర విచారణ చేపట్టి, ఎస్డిఆర్ స్కూల్లో మౌలిక సదుపాయాలు లేవన్నటువంటి విషయం పైన, అపరిశుభ్రత విషయం పైన, హాస్టల్ అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి హాస్టల్ విషయం పైన, విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి అసౌకర్యంగా విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించిన అంశాల పైన సమగ్ర విచారణ చేపట్టి  రాష్ట్ర కమిషనర్ కి సమగ్ర నివేదిక అందించాలని విజ్ఞప్తి చేసిన AISF నంద్యాల జిల్లా కార్యదరి ధనుంజయ్ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని SDR వరల్డ్ స్కూల్ లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను వారు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు గాని, అదేవిధంగా సంబంధిత అధికారులకు గానీ ఎస్టిఆర్ స్కూల్ యాజమాన్యం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నంద్యాలలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ను పిలిపించుకొని అక్కడే అంబులెన్స్ పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా వైద్యం అందించడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ విద్యాశాఖ అధికారులను గేటు బయటనే చాలాసేపు వెయిట్ చేయించినటువంటి ఘటన కూడా జరిగిందని వారు తెలిపారు.అంతేకాకుండా ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ అని చెప్పుకుంటూ ప్రభుత్వ అనుమతులు లేకుండా హాస్టల్ నడుపుతూ 30 మంది పడుకునేటువంటి ఒక చిన్న గదిలో ఒక చిన్న ఏసి మాత్రమే ఉంచిఇరుకు గదుల్లో పడుకోబెడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హాస్టల్ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా లేవని,శానిటేషన్ రూల్స్ ఏమాత్రం పాటించడం లేదని వారు తెలిపారు.కావున జిల్లా విద్యాశాఖ అధికారులు SDR వరల్డ్ స్కూల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన పైన సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ అనుమతులు లేకుండా హాస్టల్ నడుపుతున్నటువంటి శానిటేషన్ రూల్స్ పాటించినటువంటి, ఇరుకిరుకు గదుల్లో  విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి  చిన్న గదిలో ఏసీ ఒక్క ఏసీ మాత్రమే ఏర్పాటు చేసి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి SDR స్కూల్ యాజమాన్యం పైన సమగ్ర విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఎస్టిఆర్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో AISF జిల్లా కోశాధికారి సురేష్, నాయకులు రమణ, శేఖర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author