జల వనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి
1 min readబాధ్యతలు స్వీకరణ… శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్. ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించే ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ ఎస్ బాల చంద్రా రెడ్డి ఆయన స్థానంలోనే కొనసాగిస్తున్నారు. స్థానిక ఆర్ ఎస్ రోడ్డులోని జల వనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ కేసీ కెనాల్ డిఈ ( ఎఫ్ఏసీ) ప్రసాద్, డి. రామకృష్ణ, ఈఈలు, జెఈలు తదితరులు సిబ్బంది జల వనరుల శాఖ ఎస్ఈ ఎస్. ద్వారక నాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత ఎస్ఈ ద్వారక నాథ్ రెడ్డి సి.ఈ. కబీర్ బాష ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు సక్రమంగా నిర్వహించి… కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎస్ఈ కబీర్ బాష ఎస్ఈ ద్వారక నాథ్ రెడ్డికి సూచించారు.