సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్
1 min readఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, అక్టోబర్ 6 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, మీ జీ తెలుగులో!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జీ తెలుగు ఆవిర్భావం నుంచి విలక్షణమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. వినోదాల పరంపరను కొనసాగిస్తూ జీ తెలుగు పాపులర్ షో సరిగమప సరికొత్త సీజన్తో వచ్చేస్తోంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో విజయవంతంగా 15 సీజన్లు పూర్తిచేసుకున్న జీ తెలుగు సరిగమప తన తదుపరి సీజన్ను ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ సెప్టెంబర్ 29న, సా|| 6:00 ప్రారంభం, అక్టోబర్ 6 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గాయకులకు ప్రోత్సహించే లక్ష్యంతో డ్యాన్సింగ్, సింగింగ్ షోలతో మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తోంది జీ తెలుగు. ఇందులో భాగంగానే విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చేసుకున్న సింగింగ్ షో ‘స రి గ మ ప’ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో గాయనీ గాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే మూడు జట్లుగా పోటీపడతారు. ఈ జట్లకు మెంటర్లుగా రేవంత్, రమ్య బెహరా, అనుదీప్ దేవ్ నాయకత్వం వహిస్తారు. ఈ సీజన్ కు ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – అనురాధ గూడూరు మాట్లాడుతూ, “యువ, అసాధారణ ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ లాంచ్ ప్యాడ్ గా ఉన్న జీ తెలుగు సరిగమప సీజన్ 16 ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో సింగింగ్ యూత్ ఐకాన్ కోసం పోటీ జరుగుతుంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ ప్రతిభావంతులైన గాయనీ గాయకులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఇప్పటికే మనం చూసిన ఎనర్జీ, ప్యాషన్, టాలెంట్ చెప్పుకోదగ్గవి. తమ కలలను నిజం చేసుకోవడమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఓ వేదికను అందించడమే మా ఉద్దేశం. ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.