ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి
1 min readజమ్మి చెట్టు ప్రాంతాన్ని పరిశీలించిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బానీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దసరా పండుగ రోజున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నందికొట్కూరు మున్సిపాలిటీ వెస్ చైర్మన్ మొల్ల రబ్బానీ మున్సిపాలిటీ సిబ్బందితో అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఈనెల 12 వ తేదీ శనివారం దసరా పండుగ రోజున పట్టణంలో ఉన్న ప్రజలు మరియు భక్తాదులు పట్టణం నుండి ఆత్మకూరు రహదారిలో ఉన్న జమ్మి చెట్టు వరకు వచ్చి జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.అందుకు గాను జమ్మి చెట్టు పరిసర ప్రాంతాలను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బానీ సోమవారం ఉదయం పరిశీలించారు.అక్కడున్న గడ్డి, కంప చెత్తా చెదారాన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయన దగ్గరుండి పరిశుద్య కార్మికులతో శుభ్రం చేయించారు.నంద్యాల పార్లమెంట్ టిడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ జమ్మి చెట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పట్టణంలో ఉన్న ప్రజలు పండుగ రోజున ఈ ప్రాంతానికి ప్రజలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపాలిటీ కమిషనర్ బేబీకి వైస్ చైర్మన్ సూచించారు.ఈ కార్యక్రమంలో 5 వ వార్డ్ ఇంచార్జ్ సన అబ్దుల్లా,పట్టణ ఉత్సవ కమిటీ సభ్యులు శేఖర్,వెంకటేష్,సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాసులు నాయుడు, మున్సిపాలిటీ పరమేష్ మరియు కార్మికులు పాల్గొన్నారు.