జిల్లా కలెక్టర్ ప్రారంభించిన శీతల గడ్డంగి.. నిరుపయోగం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దాదాపు ఆరు ఏడు నెలల క్రితం మండలంలోని బుక్కాపురంలో శీతల గడ్డంగి ప్రారంభించారు . ప్రారంభించిన రోజు నుంచి నేటి వరకు ఉద్యాన ఉత్పత్తుల సేకరణ శీతల గిడ్డంగి కేంద్రం నిరుపయోగం పడి ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన ఉత్పత్తుల సేకరణ మరియు నిల్వ కు సంబంధించి. దాదాపు 15 లక్షల రూపాయలతో మహానంది మండల అరటి రైతుల ఉత్పత్తుల ,సేకరణ , నిల్వ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎఫ్ పి ఓ వాటా 25 శాతం ప్రభుత్వ రాయితీ 75 శాతం, ఎం యు డి హెచ్ వాటా 40 శాతం ఆర్ కే యు వి 35% శీతల గిడ్డంగుని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అరటి పండించే రైతులతో ఒక కమిటీని కూడా వేశారు. వీటిపై తనిఖీ బృందంలో భాగంగా జిల్లా నీటి సూక్ష్మ సాగు అధికారిని ఉమాదేవి నాగరాజు లను నియమించారు . అన్ని బాగానే ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు ఎంతమంది రైతులు అరటిపంటను కోత కోసిన తర్వాత నిల్వ చేస్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, అరటి రైతుకు కనీసం మద్దతు ధర లభిస్తుందా, లభించని సమయంలో శీతల గిడ్డంగిలో నిలువ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. లక్షల రూపాయలతో నిర్మించిన శీతల గడ్డంగి అరటి రైతులకు వరప్రసాదంగా మారుతుంది అనే ఆశలు అడియాశలు అయ్యాయా, లేక రైతులే అరటి ఉత్పత్తులను దళారుల చేతిలో విధి లేని పరిస్థితులలో పెట్టి విన్న కుండి పోయారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.