PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయండి..!

1 min read

విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ పేరుతో లక్షలకు పడగెత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఇన్ని జరుగుతున్న పట్టించుకోని జిల్లా మండల విద్యాధికారుల వైఫల్యం

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ ను సీజ్ చేసి దీనిని నడుపుతున్నటువంటి విక్టరీ కోచింగ్ సెంటర్ ప్రభుత్వ టీచర్ అయినటువంటి అధినేతను సస్పెండ్ చేయాలని ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ ( శివ నారాయణ శర్మ )గారికి ఆర్ యు ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి విక్టరీ మరియు వివిధ కోచింగ్ సెంటర్లో విద్య వ్యవస్థ  నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ కోచింగ్ సెంటర్లు నడపడం జరుగుతుంది. నాలుగవ తరగతి ఐదవ తరగతి ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను వీరు టార్గెట్ చేసి స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని వారి కోచింగ్ సెంటర్లో చేర్చుకొని పాఠశాల సమయంలో విద్యార్థి పాఠశాలలో ఉండకుండా ఆ కోచింగ్ సెంటర్ లో ఉంచడం జరుగుతుంది. కానీ ఆ పిల్లవాడు చదువుతున్నట్లు అక్కడ ఉండే టీచర్ని మచ్చిక  చేసుకుని విద్యార్థి స్కూలుకు వెళ్లకపోయినా కూడా టీసీలు ఇష్యూ చేపించడం వీరి నైజం అని. అదేవిధంగా కోచింగ్ సెంటర్లో చేరినటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుండి ఆరు నెలలకు గాను 70 నుండి 80,000 వసూలు చేస్తున్నారనిఅదేవిధంగా మౌలిక వస్తువుల విషయంలో అక్కడ కోచింగ్ తీసుకునేటటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని. నవోదయ గురుకుల సీటు వచ్చినటువంటి వారి తల్లిదండ్రుల దగ్గర నుండి పెద్ద మొత్తంలో మరల డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విడమరచి చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నారని దీనిని బట్టి చూస్తే మండల జిల్లా విద్యాధికారులు ముడుపులు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుందని వారు వాపోయారు. అదేవిధంగా ఒక కోచింగ్ సెంటర్లో అయితే స్వయంగా స్వయంగా గవర్నమెంట్ టీచర్  నడపడం జరగడం అంటే చాలా విడ్డూరం అన్నారు. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం  ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం అంటే ఈ అధినేతలు కోట్లు దోచేస్తున్న కూడా విద్యాధికారులు పట్టించుకోకపోవడం విద్యావ్యవస్థకే సిగ్గుచేటని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు దీనిపైన స్పందించి అక్కడ ఉండేటువంటి కోచింగ్ సెంటర్లను సీజ్ చేసి దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని వారు తెలియజేశారు. లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారితీస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నవీన్ ప్రభ కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author