PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

96 తెలంగాణ మద్యం బాటిల్లు పట్టివేత..

1 min read

అతనిపై కేసు నమోదు రిమాండ్..

పల్లెవెలుగు వెబ్   నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని శాతనకోట కేసీ కాలవ దగ్గర తెలంగాణ మద్యాన్ని తీసుకువెళ్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు అన్నారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు తెలంగాణ జిల్లెల్లపాడు గ్రామానికి చెందిన బోయ నరసింహ శుక్రవారం రాత్రి తెలంగాణ నుండి 96 మద్యం బాటిళ్లు తీసుకొని వస్తుండగా అందిన సమాచారం మేరకు జంగంపాడు శాతనకోట కాల్వ దగ్గర అతన్ని అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అతనిపై కేసు నమోదు చేసి శనివారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా 13వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.గతంలో ఇతనిపై  ఒక కేసు ఉందని ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అలాగే గ్యాంబ్లింగ్ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ అన్నారు.

About Author