జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైన రిడ్జ్ పాఠశాల విద్యార్థి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న పి జీవన్ అనే విద్యార్థి జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 16 నుండి 22 వరకు జాతీయస్థాయిలో జరిగే అండర్ 12 సబ్ జూనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున రిడ్జ్ పాఠశాల విద్యార్థి పి జీవన్ ప్రాతినిధ్యం వహించుచున్నాడు . జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటున్న విద్యార్థికి పాఠశాల సీ.ఈ.వో గోపీనాథ్ , కో సీ.ఈ.ఓ సౌమ్య గోపీనాథ్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపాల్ రాజ్ కమల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.