PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన సీనియర్ జర్నలిస్టు మొహిద్దిన్ 

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప:   కడప నగరం కొత్త కలెక్టరేట్లో ఉన్న జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ ను మర్యాదపూర్వకంగా శాలువా మెమొంటో తో సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ మొహిద్దిన్ ( ఖాద్రి ) సన్మానించారు. జెసిగా కొద్దిరోజులు కిందనే బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ మీడియా వ్యవస్థ కు ముందు తీసుకెళ్లాలి మీడియా మిత్రులకు గౌరవించాలి,అలాగే మీడియా చాలా కష్టపడి పనిచేస్తుంది. మీరు ఇచ్చిన ప్రకటనలు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళుతుంది ప్రతి ప్రోగ్రాం హైలెట్ చేసే బాధ్యత మీడియా మిత్రులు కు గుర్తించాలి, మీడియా మిత్రులకు ఇంటి స్థలాలు కేటాయించాలా మీ తరఫునుండి ప్రభుత్వంకు ఒక వినతి పత్రం పంపాలని కోరడం జరిగింది.ఇదే కాకుండా మీడియా మిత్రులకు గౌరవ వేతనం లేదు, జిల్లా అధికారుల దగ్గరికి కలవడానికి వస్తే త్వరగా స్పందించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పారు.

About Author