PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“సర్వోటెక్ ఇప్పుడు సర్వోటెక్ రిన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్” గా మారింది

1 min read

పల్లెవెలుగు వెబ్  హైదరాబాద్ : ఎన్ఎస్ఇలో లిస్టెడ్ సంస్థ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఇ: సర్వోటెక్) తన పేరును “సర్వోటెక్ రిన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్” గా మార్చినట్లు ప్రకటించింది. ఈ పేరు మార్పు 18 డిసెంబర్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది.ఇటీవల, ఈ సంస్థ జర్మనీకి చెందిన లెస్జ్వి జిఎంబిహెచ్ (LESS2) తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జర్మనీ నగరాల్లో ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్లు, ఈ-కార్గో బైక్‌లు వంటి మైక్రోమొబిలిటీకి 100% సౌరశక్తితో నడిచే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ “ఎనర్‌మాస్” చేపట్టారు.ఈ ప్రాజెక్ట్‌ ఆధునిక ఏఐ ఆధారిత ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను ఉపయోగించి, వినియోగంలో శక్తి సమర్థతను పెంచడమే కాక, పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది. సౌరశక్తి ఆధారిత బైక్-పోర్ట్ స్టేషన్లు, గంటల కొద్దీ నిరంతర ఛార్జింగ్ అందించడంలో ప్రత్యేకత చూపుతాయి. ప్రాథమికంగా 50 నగరాల్లో, ప్రతి నగరానికి 2 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సర్వోటెక్ వెల్లడించింది.సర్వోటెక్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ రమణ్ భాటియా మాట్లాడుతూ, “లెస్జ్వి తో భాగస్వామ్యం సర్వోటెక్ యొక్క సుస్థిర శక్తి పరిష్కారాల దిశగా గొప్ప ముందడుగుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జర్మనీలో మైక్రోమొబిలిటీకి కొత్త దారులను తీసుకువస్తామని ఆశిస్తున్నాం,” అన్నారు.ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఈవీ టెక్నాలజీ విభాగానికి కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *