500 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు
1 min readపిఎం సూర్య ఘర్ ముఫ్ట్ బిజ్జీ యోజనలో భాగంగా ఎస్ఈసిఐ ఆధ్వర్యంలో ఐఐఐటిడిఎం కర్నూలులో రూఢాప్ సోలార్ ప్రాజెక్టుకు
జిహెచ్2 సోలార్తో భాగస్వామ్యం”
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం, ఐఐఐటిడిఎం కర్నూలు మరియు జిహెచ్2 సోలార్ మధ్య పర్సేస్ పవర్అగ్రిమెంట్ (PPA) కి సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం కింద, 500 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ ఎస్ఈసిఐ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముక్త్ బిజీ యోజన’ పథకం ప్రకారం అమలులోకి తెచ్చబడింది.ఈ కార్యక్రమంలో ఐఐఐటిడిఎం కర్నూలు రిజిస్ట్రార్ శ్రీ కె. గురుమూర్తి, జిహెచ్2 సోలార్ ప్రతినిధులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది కృష్ణమూర్తి (ఎలక్ట్రికల్ ఇంజినీర్), శ్రీనాథ్ (సివిల్ ఇంజినీర్), మరియు జి.కే. విజయానంద్ (కన్సల్టెంట్ ఇంజినీర్), మరియు ప్రొఫెసర్లు సత్యబాబు, అఖర్ ఖాన్, రవికుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.రిజిస్ట్రార్ శ్రీ కె. గురుమూర్తి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా క్యాంపస్లో పునరుత్పత్తి శక్తి వినియోగాన్ని విస్తరించి, విద్యాసంస్థకు శక్తి సామర్థ్యాన్ని అందించడం లక్ష్యమని తెలిపారు. జిహెచ్2 సోలార్ ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు ద్వారా క్రమంగా పునరుత్పత్తి శక్తి వినియోగంలో సంస్థ అగ్రగామిగా మారుతుంది” అని అభిప్రాయపడ్డారుఈ పిపిఏ తో ఐఐఐటిడిఎం కర్నూలులో పునరుత్పత్తి శక్తి రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేయబడిందని భావిస్తున్నారు.