రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 10వ తరగతి విద్యార్థుల బోధనకు వర్చువల్ క్లాస్ రూం ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాస్ రూం ట్రయల్ రన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాకర్నూలు, నవంబర్ 28: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా వర్చువల్ క్లాస్ రూం ద్వారా జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి.గురువారం జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాస్ రూం ట్రయల్ రన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు..ఈ సందర్భంగా అబ్దుల్ కలాం పాఠశాల, ఇందిరా గాంధీ మెమోరియల్ పాఠశాల ల విద్యార్థులతో కలెక్టర్ సంభాషించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్చువల్ విధానం ద్వారా పాఠశాలలలోని 10 వ తరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందించబోతున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరికరాలతో జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఒక స్టూడియోను ఏర్పాటు చేశామని తెలిపారు..జిల్లాలోని 352 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధన అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు..ఇప్పటికే 119 పాఠశాలలకు బోధన అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు..త్వరలో అన్ని పాఠశాలలకు కనెక్ట్ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన 42 మంది అనుభవజ్ఞులైన టీచర్లు వర్చువల్ విధానం ద్వారా బోధన అందించేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు..విద్యార్థులు టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యే సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.. స్టూడియో ద్వారా పాఠశాలలకు ప్రత్యక్ష ప్రసారం చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పిల్లలకు స్పష్టంగా కనిపించేలా ఇంటర్నెట్ కనెక్షన్ వేగాన్ని పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ ను పండుగలా జరపాలి: జిల్లా కలెక్టర్జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ డిసెంబర్ 7 వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక పండుగలా జరపాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. విద్యార్థుల ప్రగతి తెలుసుకోడానికి ఈ కార్యక్రమం ద్వారా వీలు కలుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.. డిసెంబర్ 7వ తారీఖున జరగబోయే మెగా పేరెంట్స్ డే కు సంబంధించిన పాటలను రికార్డ్ చేస్తున్న రికార్డు రూమును కలెక్టర్ సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్, ఇతర విద్యాశాఖ అధికారులు ఉన్నారు.