ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి
1 min readముఖ్యమంత్రికి ఆప్టా వినతి
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల కు ఓటు హక్కు కల్పించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతిరావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు కి లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించలేదు. 1950 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క విద్యా అర్హతలు చాలా తక్కువ స్థాయిలో కలిగి ఉండేవారు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు చాలా వరకు గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుకేషన్, పీహెచ్డీలు కూడా పూర్తి చేసిన వారు వున్నారు . మారుతున్న కాలం నకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ఈ విషయమై ఆలోచించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 కి సవరణలు చేయవలసిన అవసరం ఉంది.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాల లో పని చేసే వారికి ఓటు హక్కు కల్పించాలని ఆప్టా నాయకత్వం కోరుతున్నారు, ఇదే ఎస్జీటీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నదని, అలాగే ఇదే ఎస్జీటీ మూడు సంవత్సరాలు హై స్కూల్లో పనిచేస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీఓటు హక్కు లభిస్తుందని కావున గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈ విషయమై ఆప్టా విన్నపాన్ని మన్నించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తీర్మాన చేసి కేంద్రానికి పంపించి అక్కడ ఉన్న కూటమి పార్టీల ఎంపీలతో పార్లమెంట్లో తీర్మానం చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుచున్నారు.