ఇతరులకు శకుంతల సేవలు స్ఫూర్తి…
1 min readపుట్టినిల్లు పేరుతో ప్రతి ఏటా 30 మందికి సీమాంతలు జరుపడం అభినందనీయం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పుట్టినిల్లు పేరుతో రాయలసీమ శకుంతల ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్బంగా గర్భిణీ స్త్రీలకు సీమాంతలు జరుపడం అభినందనీయo శుక్రవారం రాయలసీమ మహిళా సంఘ్ అధినేత సేవా గుణశీలి పుట్టినిల్లు సృష్టి కర్త రాయలసీమ శకుంతల పుట్టినరోజు ను పురస్కరించుకొని కర్నూలు నగరంలోని అశోక్ నగర్ లోని పంపు హౌస్ వద్ద ఉన్న పట్టణ మహిళా నిరాశ్రయ వసతి గృహంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పుట్టినిల్లు పేరుతో గర్భిణీ స్త్రీలకు సీమాంతలు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నా స్నేహితురాలు అయినా సరోజ, వీరమ్మ, హసీనాకృష్ణవేణి హాజరై సీమాంతలు నిర్వహించారు. అనంతరం సరోజ మాట్లాడుతూ రాయలసీమ శకుంతల సేవలను కొనియాడారు.ఇలాంటి వేడుకలు తల్లులను పిలిచి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి గర్భిణీ స్త్రీలు పౌష్టికహారం, పోషక విలువలు గురించి అవగాహన కల్పిస్తూ సేవా గుణంతో శ్రద్ద తీసుకోవడం అభినందనీయం. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు ఆమె సేవలు స్ఫూర్తిదాయకం. ప్రతిఒక్కరు సామాజిక భాద్యత తీసుకొని మహిళల్లో పౌష్టికహారం బెస్ట్ ఫీడింగ్, మహిళలకు సంబందించిన అంశాలపైన అవగాహన కల్పించాలన్నారు.. విరమ్మ మాట్లాడుతూ.. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయబద్ధంగా ఇక్కడ మహిళలకు శ్రీమంతాలు చేయడం ఆమెకే సాటి అన్నారు. మహిళల పట్ల ఆమె చూపుతున్న ఆదరణ చాలా గొప్పదిఅన్నారు.కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆమె సేవలు అయితేనే కార్యక్రమాలు అయితేనే నిర్వహించడం అందరికీ ఆనందకరమన్నారు. రాయలసీమ శకుంతల మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా సీమాంతలు జరుపుకోలేని పేద మహిళలు కు తన వంతుగా సీమాంతలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమాంతలు చేపట్టారు. నిరాశ్రయుల ఆమె పుట్టినరోజు సందర్భంగా శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, గర్భిణీ స్త్రీలు, సేవా సంస్థ వారు నిరాశ్రయులు తదితరులు పాల్గొన్నారు.