ఆప్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా షణ్ముఖ రావు
1 min readసోమవారం రాత్రి ఆన్ లైన్ లో జరిగిన ఎ. పి ప్రైమరీ టీచర్స్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వెంకటాపురం ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేయుచున్న జి షణ్ముఖ రావు ను ఆప్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది.గతంలో ఉమ్మడి విశాఖ పట్టణ ఆప్టా జిల్లా ప్రధాన కార్యదర్శి గా విశాఖ జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ గా పని చేసిన షణ్ముఖ రావు ను రాష్ట్ర కార్యవర్గం లో తీర్మానం ఏకగ్రీవ అమోదం పొందబడి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బడ్జెట్ యందు విద్యా శాఖ కు సంబందించిన కేటాయింపు ల గురించి రాష్ట్ర కార్యవర్గం హర్షం వ్యక్త పరిచారు. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబందించిన పి ఆర్ సి, పెండింగ్ బకాయిలు గురించి యెటువంటి కేటాయింపు జరపక పోవటం గురించి విచారం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పి ఆర్ సి, ఐ ఆర్ మరియు పెండింగ్ బకాయిలు పై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు రాష్ట్ర ముఖ్య మంత్రి ని పత్రిక ముఖంగా డిమాండ్ చేయటం జరిగింది.ఎ జి ఎస్ గణపతి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.