కర్నూల్ శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవంతుడైన శ్రీరామచంద్రుడు , సీతమ్మవారు ఇద్దరూ శుక్ల నవమి తిథి నాడే జన్మించారని , ఆ సందర్భంగా ఇద్దరికీ ఊంజల సేవ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది ప్రతి నెల నిర్వహిస్తామని, కర్నూలు మెయిన్ బజార్ రామాలయం అర్చకులు శ్రీ మాళిగి హనుమేష్ ఆచార్యులు ఈరోజు ఉదయం ఉ. 11:00 గం.లకు జరిగిన ఊంజల్ సేవ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పునర్ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని కూడా తెలియజేశారు. శతాబ్ది బ్రహ్మోత్సవాలు ప్రారంభాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ చిలుకూరు ప్రభాకర్ వంద సంవత్సరాల స్టిక్కర్ను ఆవిష్కరించి భక్తులందరికీ పంచారు. ముందుగా శ్రీ తిరుపాల్ శ్రీరామావధూత భజన బృందం వారు భజన కార్యక్రమాన్ని, శ్రీ సూర్య కళ కల్చరల్ అకాడమీ కుమారి గీతాంజలి వారిచే సంగీత విభావరి నిర్వహించబడింది.”అఖిలభారత కరివేన నిత్యాన్నదాన సత్రం కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ భక్తులందరికీ అన్నదాన ప్రసాద సేవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏల్కూరు ద్వారకనాథ్ , విట్టల్ శెట్టి, శ్రీ సత్యప్రియ శ్రీ మాళీగి వ్యాసరాజ్ ,శ్రీ మాళిగి భాను ప్రకాశ్ , శ్రీహరి, విఠల్ రావు, సందడి మహేశ్ ,మాణిక్య రెడ్డి, శ్రీ దినేష్ శ్రీ ఉదయ్, శ్రీ శ్యాం , శ్రీ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.