బాణ సంచా విక్రయించే షాపులు భద్రతా చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ
1 min readజిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెల్పిన … జిల్లా ఎస్పీ.
బాణ సంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రతగా ఉండాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా , అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ డయల్ 101 కు గాని , పోలీసు డయల్ 100 కు గాని లేదా డయల్ 112 గాని సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి.జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి.. చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు.షాపుల వద్ద అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బాణ సంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రతగా ఉండాలని కోరారు.హాస్పిటల్స్ వద్ద రోగులకు ఇబ్బందులు కలిగించేలా బాణసంచా కాల్చరాదన్నారు. ప్రజలకు , రోడ్ల వెంబడి వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. జిల్లాలో బాణసంచా విక్రయ దుకాణాలు తప్పక లైసెన్సు కల్గి ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధలనకు లోబడి బాణసంచా విక్రయించాలన్నారు. లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు నిల్వ చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా , అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ డయల్ 101 కు గాని , పోలీసు డయల్ 100 కు గాని లేదా డయల్ 112 గాని సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు జరిపినా , అక్రమంగా నిల్వ ఉంచినా ఆ సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియ జేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.