ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా దుకాణాలు తెరవరాదు.. సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా దుకాణ దారులు, హోటల్ యజమానులు 144 సెక్షన్ అమలులో ఉన్నందున దుకాణాలను హోటళ్లను మూసివేయాలని అలా చేయని యెడల చర్యలు తప్పవని సీఐ పార్థసారథి అన్నారు, బుధవారం సాయంత్రం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో చెన్నూరు లోని హోటల్ యజమానులకు, దుకాణదారులకు సమావేశం ఏర్పాటు చేసి వారికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విధానాల అమలులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ దుకాణాలు, హోటల్ మూసివేయాలని ఆయన తెలిపారు అటు చేనియడల చర్యలు తప్పవని ఆయన వారిని హెచ్చరించారు, అలాగే ప్రజలు ఎవరు రోడ్లమీద గుంపులు గుంపులుగా ఉండరాదని, అదేవిధంగా తగాదాలకు, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక దుకాణదారులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు.