తేర్నకల్ గ్రామపంచాయతీ వర్కర్స్ కు కనీస వేతనాలు ఇవ్వాలి… సిఐటియు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : దేవరకొండ మండలం, తెర్నేకల్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల కు కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు గత 5 రోజులుగా విధులు బహిష్కరించి వేతనాల పెంపు కోసం అధికారులకు, పాలక వర్గమున కు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కార్మికుల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. నెలకు 6 వేల రూపాయల వేతనంతో నేటి అవసరాలతో పెరిగిన ధరలతో ఎలా జీవనం సాగించాలని వారు ఈవోఆర్డి కు విన్నవించారు. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న మాకు రక్షణ కిట్లు ఇవ్వాలని, సబ్బులు, నూనెలు, చెప్పులు, బట్టలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు శాంతి రాజు, పులి రాజు,భార్గవ్, పెద్దయ్య, రాముడు,మధు, మండిగిరి రాముడు తదితరులు పాల్గొన్నారు.