PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధిలో వెనుక బడిన రాయలసీమకు ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఇవ్వాలి

1 min read

– బలిజ సేన అభ్యర్థన

పల్లెవెలుగు వెబ్  కడప : ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన దించి సుస్థిరమైనటువంటి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు NDA కూటమి అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారని రాష్ట్ర బలిజ సేన ఉపాధ్యక్షులు ఎర్రం శెట్టి మస్తాన్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వీ రమణ అన్నారు, ఈ సందర్భంగా వారు రాష్ట్ర బలిజ సంఘ అధినాయకత్వానికి ఎమ్మెల్యే, ఎంపీ సోదరులకు బలిజ సేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో బాగా వెనుకబడిన రాయలసీమకు రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడే మంత్రివర్గంలో ఎక్కువ మందికి మంత్రులుగా చోటు కల్పించాలని బలిజ సేన తరపున వారు ఎన్ డి ఏ కూటమిని అభ్యర్థించారు, శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర కొత్త మంత్రి వర్గం లో అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లా ల నుండి ఎక్కువ మందిని మంత్రి వర్గం లోకి తీసుకోవాలని కోరారు. ఎన్నో ఆశలతో గతంలో యెన్నడూ లేని విధంగా YCP ప్రభుత్వాన్ని దించి అభివృద్ధి కోరి రాయలసీమ లో మెజారిటీ కూటమి అభ్యర్థుల ను గెలిపించు కోవడంలో పవన్ కళ్యాణ్ బలిజలు పెద్దన్న పాత్ర పోషించడం జరిగిందన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ పిలుపుమేరకు బలిజ సేన నాయకులు అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు, రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం తిరుపతిని గుర్తించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున టికెట్ ని కేటాయించడం అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ నుగుర్తించి టిక్కెట్టు కేటాయించడం ఎంతో శుభ పరిమాణం అని వారు తెలియజేశారు, ఇక్కడ ఎంతో కరుడుగట్టిన అరాచక శక్తులను ఎదుర్కొని అరాణి శ్రీనివాసులు ఆరవ శ్రీధర్ ను , అదేవిధంగా రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల NDA కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడంలో బలిజ సేన ప్రత్యేక పాత్ర వహించింది

ని వారు తెలిపారు, అదేవిధంగా జనసేన తిరుపతి ఎన్నికల అబ్జర్వర్ గా వేసిన అతికారి కృష్ణ అహర్నిశలు కష్టపడి అరణి శ్రీనివాసులు అత్యధిక మెజారిటీ సాధించడంలో భాగస్వాములయ్యారన్నారు, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు , తిరుపతి MLA అభ్యర్థి గా ప్రకటించిన తక్కువ కాలంలో నే అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది భారీ మెజార్టీతో నెగ్గారని వివరించారు, రాయలసీమ జిల్లా లకు ముఖ్య కేంద్రం, ప్రపంచ పుణ్యక్షేత్రాలలో ప్రథమ స్థానంలో ఉన్న తిరుపతి లో అనేక మంది VIP లు నివాసం కలిగి, దేశ, విదేశాల నుండి నిత్యం ప్రముఖుల రాకతో ప్రోటోకాల్ సమస్య అధికంగా ఉంటుందని, దీనివల్ల తిరుపతి MLA కు మంత్రి వర్గంలో చోటు అవసరమని గుర్తు చేశారు, గత YCP పాలనలో తిరుపతి చుట్టుపక్కల అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తుల దోపిడీమీ వెలికి తీయాలన్నారు , TTD లో జరిగిన అన్యాయాలను వెలికి తీసి ,అరాచక శక్తుల అటలు కట్టించాలని వారు తెలిపారు , భవిష్యత్తులో కూటమి కి మంచి అండదండలు కలిగి ఉండాలన్నా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మంత్రి పదవి ఇవ్వడం సమంజసం అన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ, కార్యదర్శి ఎద్దుల అనంతరాయల్, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఏ గోపాల్ రైల్వే కోడూరు అధ్యక్షులు సుంకర రవిచంద్ర, తో పాటు ఉమ్మడి కడప జిల్లా బలిజసేన నాయకులు పాల్గొన్నారు.

About Author