సంక్షేమ హాస్టళ్లలో మెనూ పాటించని అధికారులకు షోకాజ్ నోటీస్ లు జారీ
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఇవ్వకపోవడంపై సంబంధిత సంక్షేమ అధికారులకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాలను (1&2) జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహం (1) లో ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో విద్యార్థులకు ఆహార పదార్థాలు ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 215 మంది విద్యార్థులకు 21.5 కిలోల పరిమాణంలో చికెన్ కూరకు బదులుగా కేవలం 8.5 కిలోల చికెన్ కూరనే తయారు చేసి ఇవ్వడంపై సంబంధిత వెల్ఫేర్ అధికారిని కలెక్టర్ మందలించారు. బాలికల కళాశాల వసతి గృహం (2)లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చికెన్‌కు బదులుగా టమాటా కూర తయారు చేయడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వెల్ఫేర్ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ మెనూ పాటించని హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఫోకాజ్ నోటీసులు జారీచేసారు. అనంతరం సమీపంలో ఉన్న బిసి గర్ల్స్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేసారు.