PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వానొస్తే సమస్యలే.. సంతకు స్థలం లేక ఇబ్బందులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: వర్షాకాలం మొదలైంది అంటే గడివేముల మండల కేంద్రంలో ప్రతి గురువారం జరిగే సంతకు సమస్యలే. మండల వ్యాప్తంగా ప్రజలు వారం సరిపడ నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తుంటారు పంచాయతీకి ఆదాయం తెచ్చి పెడుతున్న సంతకు మాత్రం సమస్యలు తీరటం లేదు మోకాలు లోతు బురద నీటిలో సంత చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న శాశ్వత పరిష్కారం చూపటం లేదని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రత్యాయంగా శాశ్వత స్థలాన్ని  మార్కెట్ కి స్థలం చూపెట్టాలని సమస్యను పరిష్కరించాలని మండల వాసులు కోరుతున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అస్తవ్యస్తంగా మారడం మసీదు కాంప్లెక్స్ వద్ద చిన్నపాటి వర్షానికి డ్రైనేజ్ నీళ్లు నిలబడిపోవడం కొనుగోలు కోసం వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది .

About Author